నాన్నా..ఒంటరితనం భరించలేను ఏదో తెలియని ఆందోళన..సూసైడ్ నోట్రాసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆత్మహత్య 

నాన్నా..ఒంటరితనం భరించలేను ఏదో తెలియని ఆందోళన..సూసైడ్ నోట్రాసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆత్మహత్య 

గచ్చిబౌలి, వెలుగు : ‘నాన్నా..ఈ ఒంటరి జీవి తం భరించలేకపోతున్నా...మానసిక ఆందోళనతో  అనుక్షణం వేదన పడుతున్నా..ఇక ఈ జీవితం నాకొద్దు’ అంటూఓ సాఫ్ట్​వేర్​ఎంప్లాయ్​తన తండ్రికి సూసైడ్​ నోట్ ​రాసి ఆత్మహత్య చేసుకున్నది. ఏపీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామానికి చెందిన బందెల మనీషా(28) గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ నానక్​రామ్​గూడగూడలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్​వేర్ ​జాబ్ ​చేస్తోంది.

సోమవారం ఆఫీసుకు వెళ్లకుండా హాస్టల్ లోనే ఉంది. సాయంత్రం రూమ్​మేట్స్​వచ్చి చూసేసరికి ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించింది. గదిలో తండ్రికి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ఒంటరితనంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు రాసింది.